క్రైమ్

హైదరాబాద్‌లో స్పెర్మ్‌ సేకరణ క్లినిక్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు

7 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ (క్రైమ్ మిర్రర్): నగరంలో చట్టవిరుద్ధంగా స్పెర్మ్‌ సేకరిస్తున్న “ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్” Indian sperm tech clinic పై పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, హైదరాబాద్‌లోని ఈ క్లినిక్‌కు ఏ విధమైన అధికారిక అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఈ సంస్థ అహ్మదాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్ కోసం నగరంలో చట్టవిరుద్ధంగా స్పెర్మ్ సేకరిస్తున్నట్టు నిర్ధారించారు.

స్పెర్మ్‌ను డొనేట్ చేస్తున్న వ్యక్తులకు ఒక్కోసారి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. దాడుల సమయంలో స్పెర్మ్‌ సేకరణకు సంబంధించిన పరికరాలు, పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా, అధికార అనుమతులు లేకుండా ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్న కారణంగా క్లినిక్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నామని, విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Back to top button