తెలంగాణరాజకీయం

పైసా లేకున్నా నిజాయితీగా పోటీ.. చివరికి డబ్బున్నోడిదే రాజ్యం!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుత రోజుల్లో డబ్బున్నోడిదే రాజ్యం అన్నట్లుగా కాలం మారిపోయింది. నీతిగా నిజాయితీగా పోటీ చేద్దామని నామినేషన్లు వేసిన కూడా చివరికి డబ్బులు పంచిన వారికి ఓట్లు వేస్తున్నారు. అసలు ఈ జనం.. ఇటువంటి ఎలక్షన్ల సమయంలో ఏనాటికి మారుతారో కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఎందుకు ఈ సమాజం ఇలా ఏర్పడింది అనడానికి చాలానే సమాధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఒక పేదవాడు సమాజాన్ని మారుద్దామని ముందుకు కదిలిన.. అవతల జనం మాత్రం మందు పోస్తావా?.. డబ్బులు ఇస్తావా?.. చీరలు ఇస్తావా?.. మరి ఎందుకు ను పోటీ చేయడం దండగ అని ముఖం మీద చెప్పేస్తున్నారు. ఇక డబ్బున్నోడి విషయానికి వస్తే… మన గ్రామం అభివృద్ధికి నేనే దిక్కు?.. నావల్ల ఖచ్చితంగా అవుతుంది?.. గెలిచిన వెంటనే మన సమస్యలన్నీ పోతాయి అంటూ వాగ్దానాలు ఇచ్చి… ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే డబ్బులు మరియు మందులు పంచి వారి ఓట్లను లాక్కుంటున్నారు. గెలిచిన తర్వాత పంగనామాలు పెట్టడం తప్ప అభివృద్ధి అనేది ఉండదు. ఇక ఇదే సందర్భంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలవేళ కొందరు ప్రజాస్వామ్యానికి సవాలు విసురుతున్నారు. ఎలక్షన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి కూడా ఎక్కడో ఒక చోట సర్పంచ్ పదవులకు వేలంపాటలు జరుగుతున్న వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఓటర్లతో పని లేకుండా డబ్బున్నోడిదే రాజ్యం అని ఎలా మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. ఒక్క రూపాయి లేకపోయినా పేదోడు కూడా ఏదో సమాజానికి సేవ చేద్దామని ముందుకు కదిలిన కూడా చివరికి ఓటమితో నిరాశే ఎదురవుతుంది. కఠినమైన చట్టాలు వస్తే కానీ ఈ వేలం పాటలకు అడ్డుకట్ట పడేటువంటి అవకాశం ఉంది అని కొంతమంది నిజాయితీ ఓటర్లు చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలోనే ఎలక్షన్ కమిషన్ అధికారులు పంచాయతీ ఎన్నికలకు కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also : మోదీ – పుతిన్ భేటీ.. ట్రంప్ పై ట్రోల్స్?

Read also : అఖండ-2 మూవీ టికెట్ ను 5 లక్షలకు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button