
చండూరు, క్రైమ్ మిర్రర్:-మునుగోడు నియోజకవర్గ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) నూతన అధ్యక్ష కార్యదర్శులుగా రాపోలు ప్రభాకర్, ముడుపు శ్యామ్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం చండూర్ లోని రాజశ్రీ బంకేట్ హాల్లో అధ్యక్షులు కేసాని శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సమావేశంలో నూతన కమిటినీ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న సమక్షంలో ఎన్నిక చేశారు.
నూతన కమిటీ…గౌరవ అధ్యక్షుడిగా మహేశ్వరం సతీష్
అధ్యక్షుడిగా చండూరు పట్టణానికి చెందిన రాపోలు ప్రభాకర్, ఉపాధ్యక్షులు గా సంగెపు మల్లేష్(చండూరు), ముద్దం శ్రీనివాస్(మర్రిగూడెం), జాజుల స్వామి(మునుగోడు), నక్క శ్రీనివాస్( నాంపల్లి), ప్రధాన కార్యదర్శి గా ముడుపు శ్యామ్ రెడ్డి ,సహాయ కార్యదర్శులు గా కర్నాటి వెంకటేశం, దొమ్మటి కృష్ణ, పల్లె యాదయ్య,ఈడెం గణేష్, కోశాధికారిగా సంగెపు మల్లికార్జున్ తదితరులను ఎంపిక చేశారు. ఈ సమావేశంలో ఆకుల రఘుమయ్య, ఎరుకల వంశీకృష్ణ, ముత్యాలు, వెంకన్న, ప్రభాకర్, మహేష్, నల్ల స్వామి, గంట శ్రీనివాసులు, మాధగోని ఆంజనేయులు, ఇంద్రసేనారెడ్డి, గాలింక వినోద్, తదితరులు పాల్గొన్నారు.