
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఘోరి గెటప్ లో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిన లేడీ అఘోరి అసలు బాగోతం బయటపడింది. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ.. హిందూ దేవాలయాల్లో మసీదుల కూల్చవేత అంటూ… గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న లేడీ అఘోరి మరోసారి సోషల్ మీడియాలో టాపిక్ గా మారిపోయింది. ఓ కాలేజీ విద్యార్థినితో అఘోరి దర్శనమిస్తూ అందరిని కూడా ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఈ విద్యార్థిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారే. మొదటిలో భక్తితోనే అఘోరీని కలిశానని… ఆ తరువాత ఆ పరిచయం క్రమంగా పెరుగుతూ ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది అని ఆ యువత తెలిపింది. మేమిద్దరం కూడా కలిసి ఒక ఆశ్రమం స్థాపించి సేవ చేయాలని చాలా కలలు కన్నామని… కానీ అగోరి మాత్రం తన మాటపై నిలబడకపోవడంతో ఇదంతా సాధ్యపడలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఆ విద్యార్థిని. దీంతో ఈ యువతి ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా పెద్ద దుమారం రేపుతున్నాయి.
ఇప్పటికీ ఉన్న వివాదాలు చాలు అంటూ ఇప్పుడు మరికొత్త వివాదం బయటికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు పలు రకాలుగా స్పందించిన… ఫలితం లేకుండా పోయింది. మరి ఇలాంటి అగోరిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..