
హైదరాబాదీలపై మరో భారం పడనుంది. హైదరాబాద్ మెట్రో చార్జీల భారీగా పెరగనున్నాయి. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపిన L&T మెట్రో సంస్థ.. చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరిన L&T సంస్థ. అయితే అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది. కానీ ఆర్థిక కష్టాలు పెరిగిపోతుండటంతో ఇప్పుడు చార్జీల పెంపు తధ్యమని అంటున్నారు L&T సంస్థ ప్రతినిధులు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్దం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు చేశారు. మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో అమలు చేసిన 10% డిస్కౌంట్ ఎత్తివేసింది సంస్థ. ఇటీవల కాలంలో మెట్రో రైలు తరుచూ మొరాయిస్తున్నాయి. గంటల కొద్ది నిలిచిపోతున్నాయి. దంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక కష్టాల వల్లే మెయింటనెన్స్ సరిగా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చార్జీల పెంపులో మెట్రో ప్రయాణికులపై మరింత భారం పడనుంది.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..