క్రీడలు

పాకిస్తాన్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఇండియా బాయ్‌కాట్‌

  • టీమిండియా ఛాంపియన్‌ లెజెండ్స్‌ నిర్ణయం

  • ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలే కారణం

  • నేరుగా ఫైనల్‌ చేరుకున్న పాకిస్తాన్‌

  • ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య రెండో సెమీస్‌

 

క్రైమ్‌మిర్రర్‌, స్పోర్ట్స్‌: వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌ను మ్యాచ్‌ను భారత్‌ బాయ్‌కాట్‌ చేసింది. గురువారం బర్మింగ్‌హామ్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా మ్యాచ్‌ను ఆడలేమని ఇండియన్‌ లెజెండ్స్‌ తేల్చి చెప్పారు. దీంతో ఈ మ్యాచ్‌ను నిర్వాహకులు క్యాన్సిల్‌ చేశారు. రెండో సెమీస్‌ మ్యాచ్‌ ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో పాకిస్తాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. లీగ్‌ స్టేజ్‌లోనూ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

భారతజట్టు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ నేతృత్వంలో భారత్‌ లెజెండ్స్‌… ఛాంపియన్స్‌ లీగ్‌లో బరిలోకి దిగింది. ఒకప్పటి స్టార్‌ ప్లేయర్లు సురేష్‌ రైనా, ధవన్‌, హర్బజన్‌ సింగ్‌, పీయూష్‌ చావ్లా, యూసుఫ్‌ పఠాన్‌, రాబన్‌ ఊతప్ప, స్టువర్ట్‌ బిన్ని, యూసుఫ్‌ పఠాన్‌ వంటి ఆటగాళ్లతో మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆస్వాదించారు. లీగ్‌ స్టేజ్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ ఘనవిజయం సాధించింది. లీగ్‌ దశలో ఒకే మ్యాచ్‌లో గెలిచినప్పటికీ… అత్యధిక రన్‌రేన్‌ కలిగి ఉండటంతో ఇండియా సెమీస్‌కు దూసుకెళ్లింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం విధితమే. సైనిక చర్యల్లో భాగంగా రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు క్షీణించాయి. అప్పటి నుంచి క్రికెట్‌ జట్లు ఒకదానితో ఒకటి ఎప్పుడూ పోటీ పడలేదు. సెప్టెంబర్‌లో ఆసియా కప్‌, అక్టోబర్‌లో మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Read Also: 

  1. మర్రిగూడ పీఎస్‌లో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌
  2. భారత్‌పై అమెరికా టారిఫ్‌ బాంబ్‌
  3. ఇకపై బెట్టింగ్‌ యాప్స్‌కి ప్రమోషన్‌ చేయను: ప్రకాశ్‌రాజ్‌
Back to top button