ఆంధ్ర ప్రదేశ్

అప్రూవర్‌గా నారాయణస్వామి.. క్లైమాక్స్‌కి చేరిన ఏపీ లిక్కర్‌ స్కామ్‌..!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీ లిక్కర్‌ స్కామ్‌.. కేసిరెడ్డితో మొదలుపెట్టి.. ఎంపీ మిథున్‌రెడ్డి మీదుగా… మాజీ మంత్రి నారాయణస్వామి వరకు వచ్చింది. నారాయణస్వామి అప్రూవర్‌గా మారారని… కేసు క్లైమాక్స్‌కి వచ్చేసిందని సమాచారం. అంటే.. త్వరలోనే ఈ స్కామ్‌లో బిగ్‌బాస్‌ను అరెస్ట్‌ చేయబోతున్నా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. నారాయణస్వామి… గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను ప్రశ్నించిన సిట్‌అధికారులు.. స్కామ్‌కు సంబంధించి కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి సిట్‌ అధికారులు అడిగిన సమాచారం మొత్తం ఇచ్చారని చెప్పారాయన. అంటే.. లిక్కర్‌ స్కామ్‌లో ఆయన అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. అదే జరిగితే… పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మెడకు ఉచ్చు బిగిసినట్టే అని అంటున్నారు. నారాయణస్వామి ఇంటికి సిట్‌ అధికారులు వెళ్లిన సమయంలో… ఆయన సమాధానాలు దాటవేస్తున్నరని.. విచారణకు సహరించకపోతే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ.. ఆయన్ను ఆరు గంటల పాటు ప్రశ్నించి వెళ్లిపోయారు సిట్‌ అధికారులు. పైగా తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చానని నారాయణస్వామి6 చెప్పారు. అంటే… తాను తప్పుచేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన నుంచి రావాల్సిన సమాచారం రాబట్టుకుని సిట్‌ అధికారులు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

Read also : మారుతున్న నెల్లూరు రాజకీయం.. చేతులు కలిపిన అనిల్‌, కాకాణి

లిక్కర్‌ స్కామ్‌లో నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్‌ పిటిషన్ల విచారణ సమయంలో… సిట్‌ అధికారులు కొన్ని కీలక విషయాలను కోర్టు ముందు ఉంచారు. కేసు దర్యాప్తు పూర్తయిందని… ఇలాంటి సమయంలో బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. అంటే కేసు క్లైమాక్స్‌కు వచ్చిందనేగా… త్వరలోనే బిగ్‌బాస్‌ అరెస్ట్‌ అని సిట్‌ అధికారులు చెప్పకనే చెప్పినట్టేగా. నారాయణస్వామి కూడా అప్రూవర్‌గా మారితే… పార్టీ పెద్ద మెడకు ఉచ్చు బిగిసినట్టే అని.. బిగ్‌బాస్‌ అరెస్ట్‌ తప్పదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. లిక్కర్‌ స్కామ్‌ను.. సిట్‌ అధికారులు ఎవరి అరెస్ట్‌తో ఫుల్‌ప్టాప్‌ పెడతారో చూడాలి.

Read also: ఎర్రం నాయుడు మళ్లీ పుట్టాడు.. అభిమానుల మనసుల్లో ఆనందం!

Back to top button