క్రీడలుజాతీయం

Women Cricketers: ఆ మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్, ఇక వాళ్లంతా రైల్వే ఆఫీసర్లే!

రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు మహిళా క్రికెట్లను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Indian Railway: స్పోర్ట్స్ అద్భుతంగా రాణించి ప్లేయర్స్ కు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి గౌరవించడం సాధారణంగా జరుగుతుంది. ఆయా ప్రభుత్వాలు గ్రూప్ 1 ఉద్యోగాలు అందిస్తుంటాయి. తెలంగాణలో నిఖత్ జరీన్, సిరాజ్ సహా పలువురికి ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగాలు దక్కాయి. ఇక తాజాగా 2025 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌ లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు మహిళా క్రికెటర్లకు అద్భుతమైన అవకాశం కల్పించింది. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ ముగ్గురు మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

రైల్వే ఆఫీసర్లుగా ముగ్గురు మహిళా క్రికెట్లరు

టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళా క్రికెటర్లు ప్రతికా రావల్, స్నేహా రానా, రేణుకా సింగ్‌ ఠాకూర్‌‌ ను ఇండియన్ రైల్వేలో ఆఫీసర్లుగా నియమించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ ముగ్గురు క్రికెటర్లు గ్రూప్ బీ గెజిటెడ్ ఆఫీసర్లతో సమానమైన సాలరీతో పాటు, బెనిఫిట్స్‌ ను పొందనున్నారు. వరల్డ్ కప్‌ లో చక్కటి  ప్రతిభ కనబరిచినందుకు గానూ ఆర్ఎస్‌పీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ప్రతికా రావల్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నప్పటికీ..

సెమీ ఫైనల్స్‌ కు ముందు ప్రతికా రావల్ గాయానికి గురైంది. దీంతో టోర్నమెంట్‌ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలో షెఫాలీ వర్మను రీప్లేస్ చేశారు. స్నేహ రానా బౌలింగ్ ఆల్ రౌండర్‌గా తన సత్తా చాటారు. రేణుకా సింగ్ తన బౌలింగ్‌‌తో భారత్ కప్పు గెలవడానికి తన వంతు కృషి చేశారు. నవంబర్ 2వ తేదీన జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button