
-
అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్త జనులు
-
ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు
-
హిందూ సంప్రదాయ దుస్తులను ధరించి ఆలయానికి రావాలి – ఈ ఓ మోహన్ రావు
మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్) : మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాల లో స్వయంభువై వెలసిన శ్రీ సూర్య గిరి రేణుకా ఎల్లమ్మ దేవత భక్తులకు కొంగు బంగారమై కోరినకోర్కెలు తీర్చేటి మహిమగాళ్ళు ఎల్లమ్మ ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు.ప్రతి మంగళ వారం అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకారంతో తీర్చిదిద్ది అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు మంగళవారం అమ్మవారికి ఇష్టమైన వారం కావడంతో దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు దర్శనానికి తరలి వస్తారు. దీప ధూప నైవేద్యాలతో డప్పు కొమ్ములతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.దర్శనానికి సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ ఈఓ మోహన్ రావు తెలిపారు.
అధిక సంఖ్యలో రావడంతో ఆలయానికి వెళ్ళే దారిలో కిలో మీటర్ వరకు వాహనాలతో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆలయ సిబ్బంది జోక్యంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు.భక్తులు దర్శనానికి అధిక సంఖ్యలో రావడంతో కొంత సమయం పాటు అర్చన కార్యక్రమాలు నిలిపివేసారు,ఆలయ గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసిన ఆలయ కమిటీ ఆలయానికి వచ్చేవారు హిందూ సంప్రదాయ దుస్తులను ధరించిరావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.