ఆంధ్ర ప్రదేశ్సినిమా

మూడు రోజుల్లోనే 24 కోట్లు సంపాదించిన “కోర్ట్ “

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- చిన్న సినిమా అయినా… కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారు అనేది తాజాగా విడుదలైన కోర్టు సినిమాని ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో, పెద్ద నటులు లేకుండా సులభంగా మూడు రోజుల్లోనే రికార్డు కలెక్షన్లను రాబట్టింది. హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా మార్చి 14న తక్కువ అంచనాలు నడుమ విడుదలై నేడు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం 24 కోట్లు వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం తాజాగా ట్విట్ చేసింది. కొత్తగా పరిచయమైన రామ్ జగదీష్ తర్కెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, శ్రీదేవి, రోషన్, శివాజీ లాంటి వ్యక్తులు కీలకపాత్రలు పోషించారు.

Read More : కెసిఆర్ జాతిపిత… రేవంత్ రెడ్డి బూతు పిత: హరీష్ రావు ..

ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్ఏ లోను 600 కే డాలర్లు రాబడినట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ఎంత చిన్న సినిమా అయినా కానీ అందులో కథ బాగుంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు సినిమాని బ్లాక్ బస్టర్ చేసే వరకు వదిలిపెట్టరు. స్టోరీ బాగుంటే ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తారనేది ఈ సినిమా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే ఎంతో బడ్జెట్ పెట్టి పాన్ఇండియా లెవెల్ లో సినిమా తీసిన స్టోరీ బాగా లేకుంటే విడుదలైన మొదటి రోజునే ఆ సినిమాని పాతాళానికి తొక్కేస్తారు. అయితే ఎట్టకేలకు హీరో నాని చేసిన వ్యాఖ్యలకు ఫలితం దక్కింది. సినిమా విడుదల అవ్వకముందు హీరో నాని ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేను నిర్మించిన ఈ సినిమా బాగ లేకపోతే నేను నటించిన హిట్ త్రీ సినిమాకు ఎవరు థియేటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ అతను మాటలు నమ్మి థియేటర్కు వెళ్లి మరి ఈ సినిమాని చూశారు. అన్నట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది అలాగే మంచి కలెక్షన్లను కూడా రాబడుతుంది.

Read More : తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ రచ్చే.. మూడు కీలక బిల్లులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button