ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ - అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

కట్టుకున్న భార్య… పైగా నిండు గర్భిణి.. ఎలా చంపాలని అనిపించిందో. భార్యపై ఇష్టం లేకపోయినా… రక్తంపంచుకుని పుట్టబోతున్న బిడ్డపై అయినా ప్రేమ లేదా.. ఆ కర్కోటకుడికి. కొన్ని గంటల్లో ఈ లోకంలోకి అడుగుపెట్టబోయే బిడ్డతోపాటు… తల్లిని కూడా చంపేశాడు. ఎంత దారుణం కదా…! ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు… ఈ సమాజంలో ఎలాంటి దుర్మార్గులు ఉన్నారనేది. విశాఖ జిల్లా మధురవాడలో ఈ ఘోరం జరిగింది.

మధురవాడలో ఉంటున్న అనూష నిండు గర్భిణి. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కనింది. బిడ్డను ఈ లోకంలోకి తీసుకొచ్చి.. బాగా పెంచాలని ఆశపడింది. కానీ.. ఆమె ఆశలన్నీ తన చేతులతో చిధిమేశాడు భర్త జ్ఞానేశ్వర్‌. పుట్టబోయే బిడ్డతోపాటు తల్లి ప్రాణం తీశాడు. సాధారణంగా వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడే ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి. కానీ.. ఈ కేసులో అలాంటివి ఏవీ లేవు. కేవలం… భార్యను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచనే ఉంది జ్ఞానేశ్వర్‌కు. అందుకే.. ఇంతటి ఘోరానికి తలపడ్డాడు. అనూషను వదిలించుకునేందుకు.. జ్ఞానేశ్వర్‌ ఎన్ని కుట్రలు పన్నాడో తెలిస్తే ఆశ్చర్యమేస్తోంది.


Also Read : అమీన్‌పూర్‌లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్‌


అసలు ఏం జరిగిందంటే… అనూష-జ్ఞానేశ్వర్‌ది ప్రేమపెళ్లి. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. విశాఖ బీచ్‌రోడ్డులోని యూనివర్సిటీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్న అనూష వెంట పడ్డారు జ్ఞానేశ్వర్‌. ప్రేమ పేరుతో డ్రామా చేశాడు. నిజమని నమ్మి ఆమె కూడా ప్రేమించింది. వల్లో పడింది కదా అని… శారీరకంగా కలవాలని ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పకోలేదు… అన్నీ పెళ్లి తర్వాతే అని తప్పుకుంది. దీంతో.. అనూషపై ఆశపెంచుకున్న జ్ఞానేశ్వర్‌.. వేరే మార్గం లేక.. ఇంట్లోవారికి తెలీకుండా అనూషను పెళ్లిచేసుకున్నాడు. బెంగళూరులో ఉంటున్నానని చెప్పి… విశాఖలోని మధురవాడలో అనూషతో కాపురం పెట్టాడు. కొన్నాళ్లకు ఆమెపై ఉన్న మోజు తీరిపోయింది జ్ఞానేశ్వర్‌కు. అనూష గర్భవతి కూడా అయ్యింది. దీంతో ఆమెను ఎలాగైన వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. విడాకులు కావాలని కూడా ఒత్తిడి చేశాడట. కానీ అనూష ఒప్పుకోలేదు. దీంతో.. ఆమెపై కోపం పెంచుకున్నాడు. ప్రేమగా మెలగడం మానేశాడు. సరదాగా బయటకు కూడా తీసుకెళ్లేవాడు కాదని స్నేహితులు చెప్తున్నారు. కలిసి ఫొటోలు దిగేందుకు కూడా ఇష్టపడేవాడు కాదట.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button