అంతర్జాతీయం

ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు బ్రేక్.. భారత్ కీలక నిర్ణయం!

F-35 Fighter Jets: అడ్డగోలు టారిఫ్ లతో రెచ్చిపోతున్న అమెరికాకు సరైన జవాబు చెప్పేందుకు రెడీ అవుతోంది భారత్. ఇండియన్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు వేసిన అమెరికా నుంచి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు కొనుగోళ్లను నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులకు భారత్ తెలిపినట్లు బ్లూమ్ బర్గ్ రిపోర్టు వెల్లడించింది. “మీ ఫిఫ్త్ జెనరేషన్ ఎఫ్-35 ఫైటర్ జెట్ల కొనుగోలు మీద మాకు ఆసక్తి లేదు” అని తేల్చి చెప్పనట్లు సమాచారం.

ఇక ప్రధాన రక్షణ ఒప్పందాలకు నో

ఇకపై అమెరికాతో ముఖ్యమైన రక్షణ ఒప్పందాలకు భారత ప్రభుత్వం అనుమత ఇచ్చే అవకాశం లేదని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. మేకిన్ ఇండియాలో భాగంగా ఏదైనా భాగస్వామ్యంతో దేశీయంగా ఆయుధాల తయారీపై భారత్‌ పెద్ద ఎత్తున దృష్టి పెట్టినట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ఎఫ్‌-35లను కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఆ యుద్ధ విమానాలు ఓ చెత్త అంటూ గతంలో ఎలాన్‌ మస్క్‌ చేసిన కామెంట్స్ ను బేస్ చేసుకుని విపక్ష కాంగ్రెస్‌.. మోడీ సర్కారు నిర్ణయంపై విమర్శలు చేసింది. ఇప్పుడు అవే యుద్ధ విమానాల కొనుగోలకు స్వస్తిపలకబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read Also: అమెరికా యాక్షన్.. రష్యా రియాక్షన్.. ఇరు దేశాల మధ్య కొత్తలొల్లి!

Back to top button