తెలంగాణ

AIMIM :ఓవైసీ భారీ బహిరంగ సభ.. ఓల్డ్ సిటీలో హై టెన్షన్

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సాయంత్రం ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌ దారుల్‌సలాంలో భారీ నిరసన సభ నిర్వహించనున్నారు. బోర్డు అధ్యక్షుడు ఖలీద్‌ సైఫుల్లా రెహ్మనీ అధ్యక్షతన జరిగే సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లిం మత నాయకులు, ప్రతినిధులు పాల్గొంటారని ఒవైసీ తెలిపారు. వక్ఫ్‌ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారని అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని, వక్ఫ్‌ అంటేనే తన దృష్టిలో ఓ ప్రార్థనా స్థలం అని అన్నారు. మోడీ సర్కార్‌ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, వారి చర్యల వల్ల ఆర్టికల్‌ 26కు విఘాతం కలుగుతోందని అసదుద్దీన్‌ అన్నారు.


Also Read : ఇండ్లలోకి వెళ్లి మోటార్లు సీజ్ చేస్తే ఖబర్దార్.. అధికారులకు మాధవరం వార్నింగ్


మరోవైపు వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహిస్తున్న బహిరంగ సభపై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. అరే ఓవైసీ దమ్ ఉంటే ఈరోజును బహిరంగ సభ పెట్టినావు కదా నిజం చెప్పనికి ప్రయత్నం చెయ్ అని సవాల్ విసిరారు.జనాలను రెచ్చగొట్టేందుకు ఒవైసీ సభ నిర్వహిస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు. వక్ఫ్‌బోర్డుపై ఒవైసీ నిజాలు చెప్పాలన్నారు.తెలంగాణలో వక్ఫ్‌ బోర్డు ల్యాండ్‌ను తక్కువ రేటుకు అమ్మినప్పుడు ఏంచారని ప్రశ్నించారు. వక్ఫ్‌ బోర్డు ల్యాండ్‌ డబ్బులు ఎక్కడ పోతున్నాయో చెప్పాలన్నారు. వక్ఫ్‌ బోర్డు ల్యాండ్‌లు ద్వారా పేదలకు ప్రయోజనం జరగాలని మోడీ ఈ బిల్లు తెచ్చారన్నారు రాజాసింగ్‌.

ఇక ఒవైసీ నిరసన సభతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో వేలాది మంది బలగాలను మోహరించారు. సభ శాంతియుతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు

  2. నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

  3. అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్

  4. సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్

  5. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్‌ వైపుకా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button