తెలంగాణ

వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లాలో ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్ఏపీ కళాశాల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతి అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్టనికులు తెలిపిన వివరాల ప్రకరంగా..

ఒక కారు వేగంగా దూసుకొచ్చి వెనక నుంచి స్కూటీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తేలిపారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భారతి అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 న లోక్ అదాలత్

రెండు రోజుల క్రితం (నవంబర్ 3వ తేదీ సోమవారం) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్-ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మంగళవారం ఉదయం తాండూరు మండలం కరణ్‌కోట్ సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:ఉమెన్స్ వరల్డ్ కప్ చూడడానికి కారణం ఇదే.. జగన్ కు కౌంటర్ ఇచ్చిన లోకేష్

Back to top button