సినిమా

ఈ సినిమా చూసి మనోళ్లు సిగ్గుపడాలి… మిగతా వాళ్ళకి హ్యాట్సాఫ్ : ఆర్జీవి

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :-తెలుగు దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనికి ఏ విషయమైనా నచ్చలేదంటే నేరుగా ముఖం మీదే చెప్పేటువంటి మనస్తత్వం. మరోవైపు ఏదైనా నచ్చితే మాత్రం అదే ముఖంపై ప్రశంసలు వర్షం కురిపిస్తారు. ఇక తాజాగా కాంతారా చాప్టర్ 1 సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో పాటు ప్రశంసల వర్షాన్ని సంపాదిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం అలాగే హీరోగా నటించిన ఈ ఫ్రీక్వెల్ సినిమాపై మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ, జూనియర్ ఎన్టీఆర్ వంటి చాలామంది ప్రముఖులు స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ సినిమా పై తాజాగా రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో రివ్యూ ఇస్తూ తెగ పొగిడేశారు. హీరో రిషబ్ శెట్టి అలాగే అతని టీం బీజీఎమ్, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ ఇలాంటివి చాలా అద్భుతంగా చూపించడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్సాఫ్ అని అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత భారతదేశంలోని దర్శకులు అందరూ కూడా సిగ్గుపడాలని చెప్పకొచ్చారు. కేవలం ఈ సినిమా కష్టానికి మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలవడానికి అర్హత ఉందని అన్నారు. రిషబ్ శెట్టి ఒక హీరోనా లేదా దర్శకుడా నాకు ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ ఉందని అన్నారు. ఇక దీనికి వెంటనే రిషబ్ శెట్టి కూడా వినయంగానే స్పందిస్తూ ట్విట్ చేశారు. నేను కేవలం సినిమా లవర్ మాత్రమే సార్… మీ ప్రేమ మీ మద్దతుకు ధన్యవాదాలు అని ఆర్జీవికి రిప్లైగా ట్విట్ చేశారు. కాగా ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లను రాబెట్టినట్లు చిత్ర బృందం తెలిపింది.

Read also : ఇంద్ర కీలాద్రి వైపు భవానీల అడుగు…!

Read also : పక్షిలా గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్న మన తెలుగు ఆల్రౌండర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button