క్రైమ్

నల్లగొండ టుటౌన్ సీఐ అక్రమ సంబంధం! ఎస్పీకి మహిళ భర్త ఫిర్యాదు

నల్లగొండ టూటౌన్ సీఐ డానియల్ తో తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు ఫిర్యాదు చేశారు. తన భార్యతో డానియల్ వివాహేతర సంబంధం పెట్టుకుని తనను తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపిస్తూ నల్లగొండ పట్టణానికి చెందిన ప్రశాంత్ రెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన భార్యతో సీఐ డానియల్ చేసిన వాట్సాప్ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఎస్పీకి‌ సమర్పించారు. తనపై అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేయడమే కాకుండా పదేపదే స్టేషన్ కు పిలిపించుకుని బెదిరింపులకు దిగుతున్నారని‌ బాధితుడు వాపోయాడు.

తన తల్లి పేరుతో ఉన్న భూమిని‌ సైతం అమ్మి డబ్బులను ఇస్తే కేసులు లేకుండా చేస్తానని సీఐ డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. తాను సొంత డబ్బులతో నల్లగొండ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నిర్మించుకున్న ఇంట్లో కాలు పెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. సీఐ వ్యవహార శైలిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని‌ విజ్ఞప్తి చేశారు.

Back to top button