తెలంగాణ

కేసీఆర్‌ కుటుంబంలో చీలిక- షర్మిల బాటలో కవిత - కొత్త పార్టీ వైపు అడుగులు..!

బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడిన దాఖలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో కల్వకుంట్ల కుటుంబం పాల్గొనలేదు. కానీ... కవిత మాత్రం కులగణనలో పాల్గొన్నారు.

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కేసీఆర్‌ కుటుంబంలో చీలక రాబోతోందా…? కల్వకుంట్ల కవిత వేరు కుంపటి పెట్టబోతున్నారా…? జగన్‌పై షర్మిల తిరుగుబావుటా ఎగరేసినట్టు… కవిత కూడా సొంత పార్టీపై బాణం ఎక్కుపెడుతున్నారా..? బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి.. సామాజిక తెలంగాణ పేరుతో కొత్త జెండా ఎత్తబోతున్నారా…? అంటే.. జరుగుతున్న పరిణామాలు, కవిత రియాక్షన్‌ చూస్తుంటే అవును అనేలానే ఉన్నాయి. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనంగా మారుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

కల్వకుంట్ల కవిత… కేసీఆర్‌ కూతురు. 2014-2019లో నిజామాబాద్‌ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఘోర పరాజయం పొందారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఏటా బతుకుమ్మను ఘనంగా నిర్వహిస్తూ… బంగారు బతుకమ్మగా పేరుతెచ్చుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో జైలుకు వెళ్లారు. కొన్ని నెలలు జైలు జీవితం గడిపి… బెయిల్‌పై బయటకు వచ్చారామె. ఆ తర్వాత.. ఆమె తీరు మారింది. బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడిన దాఖలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో కల్వకుంట్ల కుటుంబం పాల్గొనలేదు. కానీ… కవిత మాత్రం కులగణనలో పాల్గొన్నారు. అంటే పార్టీకి, ఫ్యామిలీకి విరుద్దంగా స్టెప్‌ తీసుకున్నారామె. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ… పార్టీ నిర్ణయాలకు విరుద్దంగా వెళ్లారని వార్తలు వచ్చాయి.


Also Read : సీఎంవోలో ప్రక్షాళన- సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌ ఇదే…!


ఇటీవల… కవిత చేస్తున్న ప్రసంగాలు కూడా బీఆర్‌ఎస్‌కు నెగిటివ్‌గానే ఉన్నాయి. భౌగోళికంగా తెలంగాణ సాధించుకోగలిగాం కానీ.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆమె అంటున్నారు. అంటే.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కూడా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని కేసీఆర్‌ను కూడా ప్రశ్నిస్తున్నట్టే కదా.. అన్న చర్చ జరుగుతోంది. ఆమె విమర్శల బాణం.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాత్రమే కాదు… సొంతింటిపై కూడా ఎక్కుపెట్టినట్టు చెవులు కొరుక్కున్నారు గులాబీ శ్రేణులు.

ఇదిలా ఉంటే… ఈమధ్య కేసీఆర్‌కు ఆమె ఒక ఘాటు లేఖ రాశారట. ఈ లేఖ బీఆర్‌ఎస్‌లోనే కాదు… కుల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు రాజేసిందని సమాచారం. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే…? బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో సామాజిక న్యాయం, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని… ఆ లేఖలో ప్రశ్నించారట కవిత. అలాగే సోదరుడు కేటీఆర్‌, సంతోష్‌రావుల వైఖరిని కూడా తప్పుబట్టారట. మహిళా నేతగా.. పార్టీ అధినేత కూతురిగా తనను అవమానాల పాలు చేస్తుంటే… రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించినట్టు సమాచారం. ఈ లేఖ… కల్వకుంట్ల ఫ్యామిలీలో పెద్ద దుమారాన్నే రేపిందట.


Also Read : పాక్ ను రెండు ముక్కలు చేద్దాం.. మోడీకి రేవంత్ పిలుపు


లిక్కర్‌ స్కామ్‌లో జైలుకు వెళ్లొచ్చిన సమయంలో సోదరుడి కేటీఆర్‌ నుంచి గానీ…. సొంత పార్టీ నుంచి తనకు తగిన మద్దతు రాలేదని ఆమె రగిలిపోతున్నట్టు సమాచారం. అందుకే ఆమె బీఆర్‌ఎస్‌పై కూడా బాణం ఎక్కుపెడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సామాజిక తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే… బీఆర్‌ఎస్‌కు పూడ్చలేని నష్టం జరుగుతుందనడం మాత్రం ఖాయం. ఏపీలో జగన్‌, షర్మిల మధ్య గొడవలు జరిగాయి. అన్నతో విభేదించి… కొత్త పార్టీ పెట్టుకున్నారు షర్మిల. ఆ తర్వాత… తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తెలంగాణ రాజకీయాల్లోనూ అదే రిపీట్‌ అవుతుందా….? వైఎస్‌ కుటుంబం మాదిరే.. కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా ముక్కలవబోతుందా..? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

ఇవి కూడా చదవండి .. 

  1. సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలపై సీరియస్ అయిన అంబటి రాంబాబు?

  2. హైదరాబాద్‌లో డిజైనతాన్‌… డిజైనర్స్‌, క్రియేటర్స్‌ కోసం ప్రత్యేక ఈవెంట్

  3. అమరావతిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ – టీడీపీని ఇరుకునపెట్టే ప్లాన్‌

  4. ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో టీడీపీ హస్తం – బాంబ్‌ పేల్చిన కేశినేని నాని

  5. పాక్ హీరోకి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్.. భగ్గుమంటున్న ఇండియన్స్!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button