క్రీడలు

ఇంగ్లాండ్ గడ్డపై… తొలి డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ యువ కెప్టెన్

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఇండియన్ తాజా యువ కెప్టెన్ శుభమన్ గిల్ తన టెస్ట్ కెరీర్ లోనే మొదటి డబుల్ సెంచరీ నమోదు చేసి రికార్డ్ సృష్టించాడు. యువ క్రికెటర్ అలాగే తన కెప్టెన్సీలో డబుల్ సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్సీలో తొలి డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే కెప్టెన్ గా సెంచరీ తో అద్భుతంగా రాణించిన గిల్… రెండవ టెస్టు మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ చేసి.. ఎవరైతే గిల్ కెప్టెన్ గా పనికిరాడు, అన్ ఫిట్ అని అన్నారో వాళ్ళ నోర్లని ఇవాళ మూయించాడు. గిల్ తన అద్భుతమైన ఆట తీరుతో 311 బంతుల్లో 200 పరుగులను పూర్తి చేశాడు. ఇందులో 21 ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. టెస్ట్ కెరియర్ లో గిల్ కు ఇదే తొలి డబల్ సెంచరీ. మొదటి టెస్టులో ఓడిపోయిన ఇండియా రెండో టెస్టులో గెలవాలని కసితో బ్యాటింగ్ చేస్తున్నారు.

సేనా దేశాలలో… తొలి డబుల్ సెంచరీ కొట్టిన ఆసియన్ క్రికెట్ కెప్టెన్ ప్లేయర్గా గిల్ నిలిచాడు. రెండో టెస్టులో మొదటి బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోగా.. యశస్వి జైస్వాల్ 87 పరుగులతో రాణించారు. కరుణ్ నాయర్ 31, రవీంద్ర జడేజా 89, సతీష్ కుమార్ రెడ్డి 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం 209 పరుగులతో శుభమన్ గిల్ 22,పరుగులతో వాషింగ్టన్ సుందర్ క్రీజ్ లో ఉన్నారు. కాగా రెండో టెస్టుకు బుమ్రా దూరమైన విషయం అందరికి తెలిసిందే.

జగన్, చంద్రబాబుకు పార్టీలు అండగా నిలబడినట్టు.. నాకు మా పార్టీ నిలబడలేదు: కల్వకుంట్ల కవిత

జైలు సమయంలో… అండగా నిలిచారని జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన వంశీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button