‘Bandariya’ Jibe Turns Tragic: ఈ రోజుల్లో జనాల్లో ఓపిక ఉండటం లేదు. చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ భార్య భర్త కామెడీగా అన్న ఓ మాటకు ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. కోతి అన్నాడని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగి.
ఇంతకీ అసలు ఏమైందంటే?
మృతురాలు తను సింగ్ (28).. తన భర్త రాహుల్ శ్రీవాస్తవతో కలిసి లక్నోలోని ఇందిరా నగర్లో ఉంటోంది. రాహుల్ నాలుగేళ్ల క్రితం.. తను సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తను సింగ్ మోడలింగ్‌లో రాణించాలని ప్రయత్నిస్తుండేది. బుధవారం సాయంత్రం సీతాపూర్‌లోని బంధువుల ఇంటి నుంచి దంపతులు ఇద్దరూ ఎంతో సంతోషంగా వచ్చారు. అంతా కలిసి కూర్చొని జోక్స్ వేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ సమయంలో రాహుల్ నవ్వుకుంటూ తను సింగ్‌ని కోతి అని పిలిచాడు. ఆమె అవమానంగా ఫీల్ అయ్యింది.
ఉరేసుకుని ఆత్మహత్య
బాధపడుతూ వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చాలా సేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు పగులగొట్టి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కి తరలించగా.. డాక్టర్లు ఆమె చనిపోయినట్లు నిర్దారించారు. తన సున్నితత్వం కారణంగానే భర్త అన్న మాటలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.





