ఆంధ్ర ప్రదేశ్

చెత్త పన్ను రద్దు… ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త పన్ను పై కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు లేదా పట్టణాలలో వసూలు చేస్తున్న చెత్త పన్నును కూటమి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 డిసెంబర్ 31 నుంచి రద్దు అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. 2021 నవంబర్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెత్త పన్ను వసూళ్లు ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలు అందరూ కూడా ఈ చెత్త పన్నును రద్దు చేస్తామని మాట ఇచ్చారు. ఈ మేరకు తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను తాజాగా అసెంబ్లీ ఆమోదించగా.. గవర్నర్ అనుమతితో ఇటీవల గెజిట్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెత్త పన్ను విధానాన్ని తీసుకువచ్చి ప్రజలకు మరింత పన్ను భారాన్ని మోపారు. తాజాగా ఈ చెత్త పన్నును కూటమి సర్కార్ రద్దు చేయగా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా పట్టణాలు మరియు నగరాలలో ఈ చెత్త పన్ను వసూలు అనేవి నేటి నుంచి లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

  1. ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించిన తెలంగాణ రాష్ట్రం!..
  2. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..
  3. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు..వినూత్న కార్యక్రమానికి శ్రీకారం నల్గొండ ఎస్పీ!..
Back to top button