
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:- చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వివిధ వార్డులను మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రాం రెడ్డి సందర్శించారు. 18వ వార్డులోని పైలాన్ పార్క్లో తిరుగుతూ యోగ పరికరాలను పరిశీలించారు. పార్క్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా పూలు, నీడనిచ్చే మొక్కలు నాటాలని వర్కర్లకు సూచించారు. అలాగే పిచ్చి మొక్కలను తొలగించి పార్కును పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
Read also : నందిపాడు గ్రామ.. శతాధిక వృద్ధుడు మృతి!
19వ వార్డులోని ఊరు చెరువు కట్టపై పూల మొక్కలు నాటే పనులను పరిశీలించారు. చెరువు చుట్టూ పచ్చదనాన్ని పెంచాలని, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. తరువాత 13వ వార్డులోని వెంకటరమణ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు త్వరగా చేపట్టాలని సంబంధిత అధికారులతో చర్చించారు. కాలనీ పరిశుభ్రతపై శానిటేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి, కాలనీ నివాసులతో వారి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు ఫిర్యాదుల మేరకు అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన కమిషనర్, సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో వార్డు ఆఫీసర్ కుమార్, రాఘవ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణు కుమార్, కాలనీ వాసులు స్వామి, నందగిరి పరమేశ్, మహేష్, షేక్ జానిమియ తదితరులు పాల్గొన్నారు.
Read also : టీఆర్పీకి మైలేజ్ దక్కేనా? తెలంగాణలో మల్లన్న పార్టీ ప్రయోగమేనా?