
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ వాడకం అనేది ఎంతలా పెరిగిపోయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈరోజుల్లో మొబైల్ ఫోన్స్ చిన్నపిల్లవాడి నుంచి పండు ముసలి వారి వరకు ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే ఎన్నో కొత్త రకాల కంపెనీల నుంచి మొబైల్ ఫోన్లు తయారు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఫోన్లు పేలుతున్న సందర్భంలో ఎంతోమంది మరణిస్తున్న సందర్భాలు లేదా గాయపడుతున్న సందర్భాలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే ఫోన్లు పేలడానికి గల కారణాలు అయితే కొన్ని ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మొబైల్ ఫోన్ పేలడానికి ముఖ్య కారణం బ్యాటరీ లోపం. ఈ బ్యాటరీ లోపాల వల్ల ఫోన్ త్వరగా వేడికి పేలుతాయి అని నిపుణులు చెప్తున్నారు. అలాగే నాసిరకం చార్జర్లు వాడడం, చార్జింగ్ పెట్టి మరి వీడియో కాల్స్ మాట్లాడడం లేదా చార్జింగ్ పెట్టే గేమ్స్ ఆడటం వంటివి చేయడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ హీటెక్కి పేలిపోతున్నాయని తెలిపారు. ఒకసారి ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లయితే వెంటనే అప్రమత్తం అవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఫోన్ బ్యాటరీ ఉబ్బితే కచ్చితంగా అది పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ మొబైల్ కంపెనీ ఒరిజినల్ చార్జర్లే వాడాలి అని.. కొన్ని సందర్భాల్లో ఫోన్ హీటెక్కినప్పుడు ఛార్జింగ్ తీసి కాసేపు ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ హీట్ తగ్గినప్పుడు ఛార్జ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఫోన్లు బిగుసుగా ఉండే పాయింట్ జోబులలో పెట్టుకోకండి.
Read also : ఈ ఏడాది నా దృష్టిలో అత్యుత్తమ ప్లేయర్లు వీరే : అశ్విన్
Read also : Interesting Facts: మీకు తెలుసా? మీరెలాంటివారో మీ కళ్లు చెప్పేస్తాయని!





