
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి స్థానిక ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు ఈ షెడ్యూల్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్, వార్డు మెంబర్లు మొదలుకొని జడ్పీ చైర్ పర్సన్ పదవుల వరకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి SEC కి అందించడం జరిగింది. ఇక తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయపరమైన అంశాలపై నేడు సమావేశమై చర్చించునుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా మొదటగా ఎంపీటీసీ మరియు జడ్పిటిసి స్థానాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు.. ఇలా దశల వారీగా ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరి బలం ఏంటో ఈ స్థానిక ఎన్నికలలో తేలిపోతుందంటూ సోషల్ మీడియా వేదికగా పోరు కూడా జరుగుతుంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ కొరకు మరిన్ని అప్డేట్స్ త్వరలోనే… మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మాపై కూడా ఒక కన్నేసి ఉంచండి…!
Read also : “విజయతిలకం” దిద్దిన తిలక్ వర్మ… పాకిస్తాన్ కు పంగనామాలు పెట్టారుగా?
Read also : మూడు రోజులపాటు భారీ వర్షాలు… అల్పపీడనమే కారణం!
Read also : తొలి ముడు రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్… తన కెరీర్ లోనే మొదటిసారి!