
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలలోని ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.’రాష్ట్రానికి అండగా ఉండడంతో పాటుగా ప్రతి మహిళకు అన్నగా ఉంటూనే.. రక్షణ కల్పించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. ఇక మరోవైపు ” అన్నాచెల్లెళ్లు మరియు అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. స్త్రీలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం వినూతన కార్యక్రమాలను చేపడుతుంది’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Read also : నేటి ముఖ్యాంశాలు… మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో..
కాగా ఈరోజు రాఖీ పండుగ పురస్కరించుకుని అక్కా చెల్లెలు అలాగే అన్నదమ్ములకు గల అనుబంధాలకు ఈ రాఖీ పండుగ ఒక ప్రత్యేకమైనది. రక్షాబంధన్ అనేది సోదరీమణులు అత్యంత పవిత్రంగా భావించే పండుగ. అన్నా చెల్లెళ్ల బంధం కలకాలం నిలవాలని.. జరుపుకునే విశిష్టమైన పండుగ రాఖీ కావడంతో నేడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాఖీనే కనువిందు చేస్తుంది. ఇక ఈరోజు ఏ సమయంలో రాఖి కడితే చాలా మంచిది అనేది ప్రతి ఒక్కరికి ఒక సందేహంగా ఉంటుంది. ఈరోజు ఏ సమయంలోనైనా రాఖీ కట్టవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే భద్రకాలం ముగిసిపోయింది. ఎందుకంటే భద్రకాల సమయంలో రాఖీ కట్టకూడదు. కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా కూడా రాఖీ కట్టవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
Read also : రోడ్లపై నీరు నిలిచిందా?.. అయితే అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు తెలుసుకోండి?