
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- WWE అనగానే చాలామందికి ఎంతోమంది తమ అభిమానించే ప్లేయర్లు గుర్తుకు వస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉన్న మనిషికి “జాన్ సీనా” అనే వ్యక్తి గుర్తుకు రావాల్సిందే. దాదాపు 20 సంవత్సరాలకు పైగా రెజ్లింగ్ ప్రపంచాన్ని ఏలాడు ఈ జాన్ సీనా. రెండు దశాబ్దాలకు పైగా ఈ WWE పోటీలలో ఏకంగా 17 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. అలాంటి రెజ్లింగ్ దిగజా ప్లేయర్ జాన్ సీనా నేడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. తన కటౌట్, తన దెబ్బలతో ప్రత్యర్థులు ఎన్నో సందర్భాల్లో దడుచుకొని పారిపోయారు. అలాంటి వ్యక్తి ఈనెల 13వ తేదీతో తన రెజ్లింగ్ కెరియర్ ను ముగించనున్నాడు. ఆధునిక రెజ్లింగ్ స్వభావాన్ని మార్చినటువంటి ఇతను ఈనెల 13వ తేదీన “THE LAST IS NOW” అనే ఫేర్ వెల్ టూర్ లో భాగంగా చివరి మ్యాచ్ ఆడునున్నారు అని ప్రకటించారు. ప్రతి ఒక్క సామాన్యుడిలోనూ నెవర్ గివ్ అప్ అనే స్ఫూర్తిని నింపినటువంటి ఈ యోధుడి ప్రస్థానం ఇంతటితో ముగియనుంది అని ఫ్యాన్స్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎంతోమంది అభిమానులు ఈయన సొంతం. అలాంటిది ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా ఇకపై మీ ఆటను చూడలేము అంటూ.. “వి మిస్ యు లెజెండ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read also : దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి భారత్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే?
Read also : అఖండ-2 ఎఫెక్ట్.. పలు సినిమాలకు భారీ ఎదురుదెబ్బ!





