
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి కూడా వేడెక్కుతున్నాయి. సాధారణంగా ఎలక్షన్ల సమయంలో ఇంత హోరాహోరీగా ఇరు పార్టీల మధ్య ఎలక్షన్ వారు చూస్తూ ఉంటాం. కానీ ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం కావస్తున్నా కూడా ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం మాత్రం ఆగట్లేదు. తాజాగా అంబటి రాంబాబు బాలకృష్ణను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ప్రపంచంలోనే అతిపెద్ద సైకో అని అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలంటే అందుకు సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేస్తానంటూ X వేదికగా పోస్ట్ చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అంబటి రాంబాబు చేసిన ఈ పోస్ట్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ” బాలకృష్ణ పెద్ద సైకో అయితే చిన్న సైకో మీ జగనే” అని ఒప్పేసుకున్నారుగా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. సైకో అంటే ఒకవైపు చెల్లిని మరోవైపు తల్లిని మోసం చేసిన వాడే కదా.. అది మీ జగనే కదా అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : ముసలాయన కాదు.. నవ యువకుడు అంటున్న జనం!
కాగా అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో చిరంజీవి జగన్ ఇంటికి వెళ్లి గట్టిగా మాట్లాడలేదని ఇది అవాస్తమని.. చిరంజీవి వల్లనే జగన్ దిగొచ్చారని చెబుతున్నదంతా కూడా అబద్ధమని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తాజాగా అంబటి రాంబాబు రియాక్ట్ కావడంతో ఆయనపై కూడా టీడీపీ కార్యకర్తలు అలాగే బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా చిరంజీవి కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో రాజకీయ పరంగాను మరోవైపు సినిమా పరంగాను యుద్ధం మొదలయ్యింది.
Read also : పెళ్లిలో కూడా పసుపు బట్టలేనా.. శభాష్ నిమ్మల అంటున్న జనం!