
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనటువంటి ఈ విధంగా ఈసారి సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాలలో కూడా ఉత్కంఠత రేపుతున్నాయి. ఎందుకంటే గ్రామాలలో ముఖ్యముగా టిఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బిజెపి అభ్యర్థులకు దీటుగా ఎంతోమంది రెబల్స్ ఈసారి బరిలోకి దిగడంతో ప్రతి ఒక్కరి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎవరికి వారు మాకు ఓట్లు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పనులు చేస్తామని ఎన్నో హామీలు ఇస్తున్నారు.
Read also : బాలకృష్ణ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. 12వ తేదీన విడుదల?
సాధారణ సర్పంచ్ అభ్యర్థులు కూడా ఓటర్లను తమవసం చేసుకోవడానికి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో హామీలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బులతో పాటు ఇంటింటికి కేజీ చికెన్ కూడా ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకానొక దశలో ఇవి అసలు పంచాయతీ ఎన్నికల లేక ఎమ్మెల్యే ఎన్నికల అని ఓటర్ల ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా ఇంత హడావిడి ఉండదు అని అంటున్నారు. ఇక ఎల్లుండి ఉదయం అనగా 11వ తేదీ ఉదయం తొలి విడత పోలింగ్ జరుగును ఉండడంతో ఇప్పటికే ఆ గ్రామాల్లో సర్పంచ్ పోటీదారులు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి చేయనంటూ పని లేదు. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరుగునున్న గ్రామాలలో వైన్స్ బంద్ చేయడం అలాగే రేపు మరియు ఎల్లుండి స్కూల్లో కు సెలవులు ఇచ్చారు.
Read also : సోనియాగాంధీకి నోటీసులు ఇచ్చిన రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు





