
Thai Man Alcohol Drinking: చిన్న చిన్న కలహాలు కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తాయి. మనుషులు, కుటుంబాలు విడిపోవడంతో పాటు చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. తాజాగా ఓ వ్యక్తి భార్య విడాకులు ఇవ్వడంతో నెల రోజుల పాటు భోజనం మానేసి బీర్లు తాగాడు. చివరకు అతడి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఇంట్లోనే చనిపోయాడు. ఈ ఘటన థాయ్ లాండ్ లో ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
థాయ్లాండ్ కు చెందిన థవీసక్ నమ్ వోంగ్సా అనే 44 ఏళ్ల వ్యక్తికి తన భార్యతో గత కొంతకాలంగా భేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య రీసెంట్ గా విడాకులు ఇచ్చింది. కొడుకును కూడా థవీసక్ దగ్గరే వదిలేసి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో అతడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్య వెళ్లిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. భార్యను తలుచుకుంటూ ఆహారం తినడం మానేశాడు. రోజంతా బీర్లు మాత్రమే తాగుతూ వచ్చాడు. కొడుకు ఆహారం తయారు చేసి పెట్టినా తినేవాడు కాదు. తాజాగా అతడి కిడ్నీ, లివర్ పని చేయడం మానేశాయి. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడి కొడుకు ఓ స్వచ్ఛందం సంస్థకు చెప్పాడు. వారు థవీసక్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని భావించారు.
ఇంటికి వెళ్లేసరికి చనిపోయిన థవీసక్
అంబులెన్స్ తీసుకుని సదరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు థవీసక్ ఇంటికి వెళ్లారు. తలుపు ఓపెన్ చేసి చూడగా, అతడు అప్పటికే చనిపోయాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. థవీసక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. థవీసక్ గదిలో వందకు పైగా బీరు సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యను మర్చిపోలేక అతడి మోతాదుకు మించి బీర్లు తాగడం వల్లే చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెల్లడవుతాయన్నారు.
Read Also: విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్ మృతి.. డెడ్ బాడీ మిస్సింగ్!