
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో విద్యారంగాన్ని సర్వనాశనం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ఎలక్షన్లలో నేను ఓడిపోకుండా ఉంటే… మరో ఐదేళ్లపాటు నేనే కొనసాగి ఉంటే కచ్చితంగా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెంది ఉండేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ నేడు ఈ కూటమి ప్రభుత్వం కారణంగా విద్యార్థులు చాలా నష్టపోతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పాలనలో విద్య పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు అని తీవ్రంగా విమర్శించారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని… దీని కారణంగా ఎంతో మంది పిల్లలు చదువును మధ్యలోనే మానేస్తున్నారని వివరించారు. విద్యారంగం తో పాటుగా వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా నిండా ముంచారని… రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా ఈ ప్రభుత్వంలో ఎటువంటి లాభం లేదని తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పండించిన పంటను రోడ్ల మీదనే పడేస్తున్నారు. ఇవన్నీ మీ ప్రభుత్వానికి కనబడట్లేదా అని ప్రశ్నించారు. ఎరువులు రేట్లు పెంచి మరి అమ్ముతుంటే ప్రజలు ఎలా కొనగలరు అని… గిట్టుబాటు ధరలు కల్పించ లేకపోతే ఎలా జీవించగలరు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల పట్ల అలాగే రైతుల పట్ల మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. తక్షణమే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Read also : ఆ పిల్లలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది : షర్మిల
Read also : తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల భారీ జరిమానా