ఆంధ్ర ప్రదేశ్

దమ్ముంటే రండి తేల్చుకుందాం… వైసీపీకి చంద్రబాబు సవాల్‌

  • ఎన్నికలకు ముందు సిద్ధం సిద్ధం అన్నారు

  • వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే అన్నింటిపై చర్చకు సిద్ధం

  • ఎవరిది విధ్వంసమే… ఎవరిది అభివృద్ధో తేల్చుకుందాం: బాబు

  • బాబాయ్‌ హత్య, కోడికత్తి డ్రామాపై చర్చిద్దాం: చంద్రబాబు

క్రైమ్‌మిర్రర్‌, అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో… ఎవరి హయాంలో అభివృద్ది జరిగిందో తేల్చుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు చాలెంజ్‌ విసిరారు. రాజంపేటలో చంద్రబాబు పర్యటించి, పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ హయాంలో అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల పాలనపై తాను చర్చకు సిద్ధమని… వైసీపీ నేతలు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన సవాల్‌ను స్వీకరించి దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలన్నారు. బాబాయ్‌ హత్య, కోడికత్తి డ్రామాలపై చర్చకు తాను సిద్ధమని చంద్రబాబు అన్నారు. అప్పులతో సంక్షేమం చేస్తే మిగిలేది చిప్పేనని గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు సెటైర్లు వేశారు.

రాయలసీమను రతనాల సీమ చేస్తా: బాబు
రాయలసీమ అభివృద్ధికి టీడీపీ సర్కార్‌ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ లక్ష్యమని హామీ ఇచ్చారు. రాయలసీమకు సాగునీరిచ్చిన ఘనత టీడీపీదేనని, ఇటీవలే కుప్పానికి కృష్ణానీరు తీసుకెళ్లామని, భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు కూడా వస్తాయని చంద్రబాబు భరోసా కల్పించారు.

Read Also:

  1. హరీశ్‌రావు వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు: ఎమ్మెల్సీ కవిత
  2. పహల్గామ్ దాడిని ఖండించిన SCO.. BRI అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోడీ!
Back to top button