
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు ఎటువంటి గందరగోళం లేకుండా ఏ వేలికి సిరా వేయాలో అనే విషయంపై తాజాగా SEC ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. మొదటగా నిర్వహించే ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్లో ఎడమచేతి చూపుడువేలుపై సిరా చుక్క వేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో మధ్య వేలు పై సిరాచుక్క వేయాలని కలెక్టర్లకు SEC అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక గందరగోళపు పరిస్థితులు ఏర్పడవు. ఎందుకంటే ఈ సిరా చుక్క అనేది ఓటర్ ఓటు వేశాడా లేదా అనేది గుర్తిస్తుంది. ఒకచోట ఓటు వేసి మరోచోటికి వెళ్లి ఓటు వేసే పరిస్థితులు నెలకుని ఉన్నాయి కాబట్టి అలాంటి చోట్ల ఈ సిరా చుక్క ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే కాంగ్రెస్ కు షాక్.. నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేస్!
ఇక ఈ నెలలో రెండు దశల్లో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 31వ తేదీ నుంచి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అని తాజాగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా జారీ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటగా ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదట విడత అక్టోబర్ 23న పోలింగ్ జరగనుంది. ఇక రెండో విడత అక్టోబర్ 27న పోలింగ్ జరుగునుంది. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ అధికారులు అలాగే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read also : మళ్లీ అడుగుపెట్టనున్న హిట్ మాన్… ఫ్యాన్స్ కు పూనకాలే!