
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో ఉన్న, ప్రాథమిక పశు వైద్యశాలకు టైమింగ్స్ గండం ఏర్పడింది. ఉదయం ఉద్యోగానికి తొందరగానే వస్తున్న వైద్య అధికారులు, ఇంటికి వెళ్లడం మాత్రం మూడు గంటల ముందే బయలుదేరుతున్నారు. ప్రజలకు సేవ చెయ్యాలని ప్రభుత్వం జీతం ఇచ్చి, విధులు నిర్వహించాలని చెబుతున్న, ప్రభుత్వ లక్ష్యానికి కొంతమంది అధికారులు గండి కొడుతున్నారు. అత్యవసర సమయంలో పశువులకు అందాల్సిన వైద్యం, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల వల్ల మృత్యువాత పడుతున్నాయి. ఉద్యోగమని కాకుండా, అధికారులు బిజినెస్ మాదిరిగా, సొంత పనుల మాదిరిగా చేస్తున్నారు అధికారులు. మంగళవారం మూడు గంటలకే పశువైద్య కేంద్రానికి తాళాలు వేసి ఇంటి దారిపట్టారు అధికారులు. ఉద్యోగ బాధ్యతగా సాయంత్రం నాలుగు గంటల వరకు డ్యూటీ చెయ్యాల్సిన అధికారులు, ముందే తట్టాబుట్టా సదరడంపై అనేక విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రజలకు సేవ చెయ్యని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాళం వేసిన పశువైద్య కేంద్రాన్ని చూసి వెనుతిరిగి పోతున్నారు శివన్నగూడెం గ్రామస్థులు. ఈ రోజే కాదు ప్రతి రోజు ఇదే తంతు అని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం అధికారులు, విధులు నిర్వహించేలా చూడాలని పబ్లిక్ కోరుతున్నారు.
Read also : “పీపీపీ” పై వైసీపీది అనవసరపు రాద్ధాంతం : మంత్రి లోకేష్
Read also : ఏపీలో హెలికాప్టర్ వార్… అసలేం జరిగిందంటే?