ఆంధ్ర ప్రదేశ్

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నిండుగా హుండీ ఆదాయం!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎటువంటి అనర్ధాలు చోటు చేసుకోకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా నిర్వహించారు. సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సేవలను కూడా అందించారు. ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. మొదటిగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసినటువంటి టీటీడీ అర్చక స్వాములకు, అధికారులకు, పోలీసు యంత్రాంగాలకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులు, మీడియా బృందాలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీ అందరి సహకారం వల్లే నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయిని అన్నారు.

Read also : విషాదంగా మారిన కర్రల సమరం.. ఇద్దరు మృతి, 100 మందికి పైగా గాయాలు?

ఇక ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8 రోజులు పాటు జరిగాయి. ఈ ఎనిమిది రోజుల్లో ఏకంగా 5,80,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు అని టిటిడి అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కేవలం కొద్ది రోజుల్లోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు భారీ ఎత్తున కానుకలు సమర్పించారు. కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే ఏకంగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది అని తెలిపారు. 26 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేశామని స్పష్టం చేశారు. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పుకొచ్చారు. ఇక ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 28 రాష్ట్రాల నుంచి 298 మంది కలాబృందాలు, గరుడసేవ రోజు 20 రాష్ట్రాల నుండి 37కలా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శించారు. ఇక ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగానే 60 టన్నుల పుష్పాలు, నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్, 90 వేల సీజనల్ ఫ్లవర్స్ ను వినియోగించామని , శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి లక్షలాదిమంది భక్తులకు 3,500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలను అందించడం గొప్ప విషయం.

Read also : ఏపీకి భారీ వర్ష సూచనలు.. జర అప్రమత్తం : హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button