ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

లిక్కర్‌ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు

  • ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం

  • ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డితో సహా పలువురి అరెస్ట్‌

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ సిట్‌ అధికారులు కూలంకషంగా విచారిస్తున్నారు. విజయసాయిరెడ్డిని ఇప్పటికే ఓసారి విచారించిన సిట్‌… మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

 

హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌కు జుడీషియల్‌ రిమాండ్‌

ఈనెల 12న ఉదయం 10గంటలకు సిట్‌ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. లిక్కర్‌ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి రాజ్‌ కసిరెడ్డేనని అప్పట్లో విజయసాయిరెడ్డి ఖరాకండిగా చెప్పారు. కుంభకోణంతో సంబంధమున్న అందరి పేర్లు బయటపెడతానని బహిరంగంగా వెల్లడించారు. అయితే సిట్‌ అధికారులు మరోసారి విజయసాయిరెడ్డిని పిలవడం ఆసక్తికరంగా మారింది. కేవలం సాక్ష్యం చెప్పడానికే రావాలని నోటీసుల్లో సిట్‌ పేర్కొంది.

Back to top button