తెలంగాణ

మెగాస్టార్‌కు బర్త్‌ డే విషెస్‌ వెల్లువ

చిరుకు సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు

  • 70వ వసంతంలోకి అడుగుడిన చిరంజీవి

  • చిరుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్‌

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ఇవాళ 70వ వడిలోకి అడుగుపెట్టారు. దీంతో చిరుకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవికి బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని పవన్ ఆకాక్షించారు.

అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, ప్రజా జీవితం, దాతృత్వంలో చిరు అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తి అని కొనియాడారు. చిరు సేవ‌, అంకిత‌భావంతో ఇంకా ఎంద‌రో జీవితాలను ప్ర‌భావితం చేయాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. మెగాస్టార్‌ నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఆనందాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నానని బాబు ట్వీట్‌ చేశారు.

Read Also:

  1. మునుగోడు “హస్తంలో” ముసలం
  2. 7 నిమిషాల్లో రెండుసార్లు.. గుజరాత్ లో భూకంపం!
Back to top button