
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణయిత 50 ఓవర్లకు 358 పరుగులు చేయగా అనంతరం చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ పై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు తరుపున విరాట్ కోహ్లీ మరియు గైక్వాడ్ ఇద్దరు కూడా సెంచరీలు చేయగా.. సౌత్ ఆఫ్రికా జట్టు నుంచి ఓపెనర్ మార్క్రమ్ సెంచరీ చేశారు. చేజింగ్ లో జట్టు విజయానికి సౌత్ ఆఫ్రికా జట్టు ప్లేయర్ లందరూ కూడా చాలానే పోరాటం చేశారు. బవుమా 46, బ్రిడ్జికే 68, బ్రెవిస్ 54, బోస్ 29, జార్జి 17 పరుగులతో ప్రతి ఒక్కరు కూడా రాణించడంతో జట్టు విజయం చాలా సులభం అయింది. అయితే మ్యాచ్ అనంతరం భారత్ పై అత్యధిక స్కోర్ చేదించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా సరసన సౌత్ ఆఫ్రికా నిలిచింది. 2019 వ సంవత్సరంలో భారత్ మొహాలి స్టేడియం లో 359 పరుగులు చేయగా ఆస్ట్రేలియా జట్టు దానిని సునాయసంగా చేదించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు 350కు పైగా ఉన్న స్కోర్ను చేదించి ఆస్ట్రేలియా సరసన చేరడమే కాకుండా చరిత్ర సృష్టించింది. సాధారణంగా సౌత్ ఆఫ్రికా జట్టు అంటేనే అదృష్టం లేనట్టుగా భావిస్తూ ఉంటారు. ప్రతి మ్యాచ్ లోను చివరి వరకు పోరాడుతారు కానీ విజయాన్ని అందుకోలేక పోతారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇప్పటినుంచి సౌత్ఆఫ్రికా జట్టుకు విజయాలు ఖాయమని అనిపిస్తుంది.
Read also : ఏపీలో నేడు కూడా భారీ వర్షాలు..!





