
మద్దూర్, క్రైమ్ మిర్రర్:- నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన రాచూరి కిష్టప్ప (103) సంవత్సరాలు వయోభారం కారణంగా మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బలహీనపడడంతో శుక్రవారం ఉదయం చివరి శ్వాస విడిచారు.
కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఆయన వయసు పైబడినా సహజశక్తులు కొంతవరకు సక్రమంగానే ఉండేవి. ఒక ప్రత్యేక విశేషం ఏమిటంటే, ఆయన నోట్లో పాత పళ్ళు ఊడిపోయిన తరువాత మళ్లీ కొత్త పళ్ళు రావడం జరిగింది. గ్రామంలో ఈ సంఘటనపై పెద్ద చర్చనీయాంశమైంది. కిష్టప్పకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వృద్ధుడి మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వంద సంవత్సరాలకు పైగా బ్రతకడం ఈరోజుల్లో మామూలు విషయం కాదు.
Read also :సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుంకరి భిక్షం గౌడ్
Read also: టీఆర్పీకి మైలేజ్ దక్కేనా? తెలంగాణలో మల్లన్న పార్టీ ప్రయోగమేనా?