తెలంగాణరాజకీయం

మరోసారి రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల వరకూ అధికారంలోకి రావడం కష్టమే అని స్పష్టంగా చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఆయన ఓ వీడియో ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ నాయకుల వ్యవహారశైలి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా ఉందని వ్యాఖ్యానించారు.

నాయకులు మొండితనంతో ముందుకు సాగుతూ ఎవరి మాట వినడం లేదని, ఓటర్లను ఆకర్షించే విధానాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఎలా మన వైపు తిప్పుకోవాలో, ఎలా గెలవాలో కూడా ఆలోచించాలన్న ఆయన.. ఈ వ్యవహారంతో తెలంగాణలో బీజేపీ బలహీనపడుతుందని ఆయన తీవ్రంగా పేర్కొన్నారు.

అంతేకాక, తెలంగాణలో పార్టీ పూర్తిగా కుంగిపోతోందని, దయచేసి కిషన్ రెడ్డి గారు బీజేపీని కాపాడండి అని వేడుకున్నారు. అయితే, రాజాసింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారాయి.

ALSO READ: డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు..?

Back to top button