
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఎన్నికల వరకు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క పార్టీపై తీవ్రంగా ఆరోపణలు చేసినటువంటి ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ పై తాజాగా కేసు నమోదు అయింది. ఒక యువతి తనను కె ఏ పాల్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సోషల్ మీడియా అంతటా కూడా ఈ విషయం తెగ వైరల్ అవుతుంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు వెంటనే హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేఏ పాల్ పై FIR నమోదు చేశారు. అయితే ఆ యువతీ ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ సమాచారం రాలేదు. కానీ కొంతమంది ఆ యువతీ కేఏ పాల్ వద్ద గత కొంతకాలంగా పనిచేస్తున్న అమ్మాయిగా చెప్పుకొస్తున్నారు. ఈ కేసుతో కేఏ పాల్ కు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.
మరిన్ని విషయాలు త్వరలోనే మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ ద్వారా వెల్లడిస్తాం.
అప్పటివరకు మాపై ఒక కన్ను వేసి ఉంచండి.
నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.
Read also : పత్తి పనికి వెళ్తున్న బాలిక… లోకేష్ చేసిన పనికి ప్రశంసలు!
Read also : భారత్ లోనూ నేపాల్ పరిస్థితిలు రావచ్చు : కేటీఆర్