తెలంగాణ

రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే!…

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. భూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. కేవలం తొమ్మిదిన్నరేండ్ల కాలంలోనే నాడు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి ప్రతి ఒక్కరు విమర్శిస్తూనే ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పుడే రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందంటూ కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మంచిందని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వెంటనే హైడ్రా పేరిట ప్రజల ఇళ్లను కూల్చివేసిందో అప్పటినుంచి ప్రజల్లోనూ వ్యతిరేకత నెలకొంది.

ఇవి కూడా చదవండి

1.ఢిల్లీ గణతంత్ర పరేడ్ వేడుకలు!.. మూడో స్థానంలో నిలిచిన ఏపీ?

2.ఏపీలో పెరుగునున్న భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు!…

3.2 గంటలు నిలిచిపోయిన మెట్రో.. హైదరాబాదీలు ఆగమాగం

Back to top button