
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా పై విశ్వరూపం చూపించింది. ఈ దిత్వ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు దంచి కొట్టాయి. ఈ వర్షాలు దాటికి ఏకంగా నెల్లూరు సిటీ మొత్తం నీటిలో మునిగిపోయింది. సిటీ మొత్తం కుండపోత వర్షాలు కురువగా నెల్లూరు జిల్లాలోని అన్ని నగరాలు కూడా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు 21.4 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయింది. దీంతో సిటీలోనే రైల్వే అండర్ పాసులు పూర్తిగా మునిగిపోయాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నేరుగా నీరు చేరిపోయాయి. దీంతో ప్రజలందరూ కూడా నానా తిప్పలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి రాత్రిపూట నీరు రావడంతో చాలామంది వరకు ఉదయం వరకు మేల్కొని ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని ముఖ్య నగరాల హైవేలపై వాహనాల రాకపోకలు అక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు నేడు తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ప్రకటించారు. ఈ దిత్వ తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలతో పాటు శ్రీలంక దేశం కూడా భారీ నష్టాన్ని చవి చూసింది. ఇప్పటికే ఈ తుఫాన్ ప్రభావం కలిగినటువంటి జిల్లాలకు ఆయా ప్రభుత్వాలు NDRF మరియు SDRF బృందాలను ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. శ్రీలంకలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండడంతో భారత సహాయ బృందాలు కూడా అక్కడికి చేరి పెద్ద ఎత్తున వారికి సహాయం అందజేస్తున్నాయి.
Read also : తెలంగాణ హైకోర్టులో 66 సివిల్ జడ్జి పోస్టులు..దరఖాస్తు ఎలా…!
Read also : GOOD NEWS: 40 ఏళ్ల వారికి నెలకు రూ.3000 పింఛన్..!





