
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవిలో జీవించే గిరిజనుల జీవనోపాధిపై మరోసారి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అడవి పై ఆధారపడి జీవించే ప్రతి గిరిజనులకు కూడా జీవనోపాధి మరియు ఆదాయ మార్గాలను పెంచేలా అధికారులు ఏమైనా చేయాలని అన్నారు. గిరిజనులు పండించేటువంటి ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింకు చేయాలని కోరారు. అలాగే ఈ గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాలలో సినిమాలు మరియు సీరియల్స్ వంటి షూటింగ్లకు ఎక్కువగా ప్రోత్సాహం ఇవ్వాలి అని అధికారులకు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలి అని సూచించారు. ఇవన్నీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యువతకు ఉపాధి లభిస్తుంది అని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటినుంచి అటవీ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులకు కూడా మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కాగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా గిరిజనులపై పూర్తి స్థాయిలో విచారణలు, పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తూ వారికి కావాల్సినటువంటి సదుపాయాలను అందించే విధంగా ప్రోత్సాహం చేస్తున్నారు.
Read also : కృష్ణ కృష్ణ… ఏందయ్యా ఈ బౌలింగ్!
Read also : Ghost Dreams: కలలో దెయ్యాలు పీడిస్తున్నాయా..? పరిష్కారం ఏమిటో తెలుసా?





