అంతర్జాతీయం

Jaishankar: లాభం ఉంటేనే మాట్లాడుతాయి, పశ్చిమ దేశాల జైశంకర్ తీవ్ర ఆగ్రహం!

కొన్ని వెస్ట్ కంట్రీస్ తమకు లాభం ఉంటే తప్ప మాట్లాడవని, ఇతర దేశాలు ఎటుపోతున్నా పట్టించుకోవని కేంద్రమంత్రి జైశంకర్ సీరియస్ అయ్యారు.

Jaishankar Slams West: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాల ద్వంద్వ నీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఆ దేశాలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్‌పై వచ్చిన రియాక్షన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయటం లేదని విమర్శించారు.

వెస్ట్ కంట్రీస్ పై జైశంకర్ అసహనం

పశ్చిమ దేశాల వ్యవహారశైలి మొదటి నుంచి అలాగే ఉందని జైశంకర్ చెప్పారు. ఎక్కడో కూర్చుని ఇండియాకు ఉచిత సలహాలు మాత్రం ఇస్తుంటాయని మండిపడ్డారు. తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే ఆ పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతాయని, తమ సొంత ప్రాంతంలో జరిగితే మాత్రం వాటిని పట్టించుకోవని ఎద్దేవా చేశారు. కొంతమంది చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ మండిపడ్డారు. సాయం చేయాలనుకునే వారితో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లా ప్రవర్తిస్తే అలాగే సమాధానం ఇస్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చాలా దేశాలు స్వార్ధం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు.

వెనెజులా మాజీ అధ్యక్షుడి అరెస్ట్ నేపథ్యంలో..

అటు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా అదుపులోకి తీసుకున్నది. అమెరికా డెల్టా ఫోర్స్‌ జనవరి 3న వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. ఈ దాడిలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వెనెజువెలాపై అమెరికా చర్యల నేపథ్యంలో జైశంకర్ పశ్చిమ దేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button