మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మండలంలోని అజ్జిలాపురం గ్రామ ప్రజలు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలపరిచిన ఎలిమినేటి సత్తిరెడ్డికి ప్రజలు మద్దతుగా నిలిచారు.. స్థానికంగా ఉంటూ, ఎమ్మెల్యే అండదండలతో ఇప్పటికే ప్రజలకు తన వంతు సహాయాన్ని అందిస్తూ, ప్రజల మన్ననలు పొందుతున్నారు సత్తిరెడ్డి..
పదవులు లేనప్పటికి ప్రజలకు ఏదో ఒక రకంగా, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా, నాయకుల ద్వారా సమస్యలు తీరుస్తున్నారు సత్తిరెడ్డి.. గ్రామం చిన్నదైనప్పటికి బిఆర్ఎస్ పార్టీ నుండి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు చొప్పున అభ్యర్థులు సర్పంచ్ భరిలో ఉన్నారు..
కాంగ్రెస్ పార్టీ అంటూ మరో వ్యక్తి నామినేషన్ వేసినప్పటికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం సత్తిరెడ్డికి మద్దతును ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే అభిమానులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు సత్తిరెడ్డిని గెలిపించాలి అంటూ, గ్రామంలో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు..
స్థానికంగా లేకుండా, కేవలం ఆర్థిక బలంతో ప్రజలను కొనుగోలు చెయ్యవచ్చనే సిద్ధాంతానికి, అజ్జిలాపురం గ్రామ ప్రజలు స్వస్తి చెప్పే విధంగా ఉన్నారనే చెప్పుకోవాలి.. గ్రామంపై కనీస అవగాహన లేకుండా, డబ్బుతో అభిమానాన్ని కొనుగోలు చెయ్యగలము అనడం పొరపాటనే చెప్పాలి..
గ్రామ సమస్యలు తెలియకుండా, కనీసం ప్రజల పేర్లు, వారు ఉంటున్న గల్లీలు కూడా తెలియని వ్యక్తులు, వలస వచ్చి గ్రామ రాజకీయాన్ని ఏలాలి అనుకోవడం హాస్యాస్పదం.. డబ్బుతో కొనలేని అభిమానం ఉంటుందని బహుశా వారికి తెలియకపోవచ్చు..
నిత్యం ప్రజల్లో కలివిడిగా ఉంటూ, పదవి లేకున్నా ప్రజల అవసరాలను తీరుస్తున్న సత్తిరెడ్డికి అజ్జిలాపురం ప్రజలు జై కొడుతున్నారు.. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో సత్తిరెడ్డి గెలుపు గ్రామ అభివృద్ధికి పునాదులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
డబ్బు, మందు, బహుమతులకు లొంగి ప్రజా క్షేత్రంలో మెదులుతున్న నాయకున్ని దూరం చేసుకోవద్దని అంటున్నారు అనుభవజ్ఞులు.. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని, ఎలిమినేటి సత్తిరెడ్డి ప్రజలను కోరుతున్నారు..





