జాతీయం

పాక్‌లోకి ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ రేంజ్‌లోనే: రాజ్‌నాథ్‌

  • ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ట్రైలరే: రాజ్‌నాథ్‌

  • భారత క్షిపణి సామర్థ్యం నుంచి పాక్‌ తప్పించుకోలేదు

  • పాక్‌ దుస్సాహసానికి ఒడిగడితే మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్య

  • లక్నోలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ను సందర్శించిన రాజ్‌నాథ్‌

క్రైమ్‌మిర్రర్‌, ఢిల్లీ: పాకిస్తాన్‌ ఒకవేళ మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే, అందుకు సరిపడా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని, దాయాది దేశంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ రేంజ్‌లోనే ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు.

యూపీ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్‌ ఏరో స్పేస్‌ యూనిట్‌ను రాజ్‌నాథ్‌ సందర్శించారు. బ్రహ్మోస్‌ క్షిపణుల తొలి విడత ఉత్పత్తి పూర్తయిన సందర్భంగా అక్కడ పర్యటించారు. బ్రహ్మోస్‌ను సైన్యానికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ రక్షణ పరిశ్రమ కారిడార్‌కు యూపీ మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్‌ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి సామర్థ్యాల నుంచి పాక్‌ తప్పించుకోలేదని అన్నారు.

ఇవీ చదవండి

  1. చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌కు షమీ కౌంటర్‌
  2. బీసీ బంద్ లో పాల్గొని రాజకీయ నాయకులని షేక్ చేసిన కవిత వారసుడు..!
Back to top button