క్రైమ్

60 స్కూళ్లకు బాంబు బెదిరింపు, బాంబ్ స్క్వాడ్స్ ముమ్మర తనిఖీలు!

Bomb Threat Call To Schools: దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు నగరంలోని స్కూళ్లకు ఆగంతకులు బెదిరింపు మెయిల్స్ పంపారు. ఆయా స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు హెచ్చరించారు. బెంగళూరులో 40, ఢిల్లీలో 20 స్కూళ్లలో బాంబులు అమర్చినట్లు అజ్ఞాత వ్యక్తులు పోలీసులకు ఈమెయిల్స్ పంపారు. బెంగళూరులోని 40 ప్రైవేటు స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించాయి. ఆర్ఆర్ న‌గ‌ర్‌ తో పాటు కేన్‌ గిరిలో ఉన్న స్కూళ్ల‌కు బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు , బాంబు స్క్వాడ్స్ తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

అటు దేశ రాజ‌ధాని ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. వెంటనే అలర్ట్ బాంబ్ స్క్వాడ్స్ ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన పాఠశాలలకు పోలీసులు,  డాగ్ స్క్వాడ్స్, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని  తనిఖీలు చేశారు. ఈ వారంలో రాజధానిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి. ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, రోహిణిలోని గురునానక్ పబ్లిక్ సావరిన్ స్కూల్, జిడి గోయెంకా స్కూల్, ద్వారక ఇంటర్నేషనల్ స్కూల్, పశ్చిమ విహార్‌ లోని రిచ్‌మండ్ స్కూల్, రోహిణి సెక్టార్ 3లోని అభినవ్ పబ్లిక్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.  అయితే, ఎక్కడా బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయంపై ఐటీ సెల్ పోలీసులు విచారణ జరపుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆగంతకులను పట్టుకుంటామని తెలిపారు.

Read Also: మళ్లీ పెరిగిన బంగారం ధర, హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే?

Back to top button