
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- స్థానిక ఎన్నికల నేపథ్యంలో, మండలంలోని కుదాబక్ష్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అంటూ, పందుల జయలక్ష్మిపాండు ప్రచారం చేస్తున్నారు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రిగూడ మండలంలో ఆయా గ్రామాలలో ప్రచారం చేసిన ఆయన, జరిగిన విషయాలపై ఆరా తీసారు. కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిని ప్రకటించక పోయినప్పటికి, తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెప్పుకుంటున్న పందుల జయలక్ష్మి పాండుపై సీరియస్ అయ్యారు. వెంటనే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడి, మిత్రపక్షం అయిన సిపిఐ పార్టీ బలపరిచిన, యరజాల సుజాత మహేందర్ కు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పుకుంటున్న పందుల జయలక్ష్మిపాండు ఎవరో మాకు తెలియనట్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తేల్చి చెప్పారు.. కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎరజాల సుజాత మహేందర్ ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ నేతలు ప్రజలను కోరారు. ఈ పరిణామంతో సిపిఐ అభ్యర్థి గెలుపుకాయమని గ్రామంలో చర్చ కొనసాగుతుంది.. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, మాజీ ఎంపీటీసీ తుమ్మల వరప్రసాద్, సిపిఐ నాయకులు బూడిద సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతంగి నవీన్ తదితరులు ఉన్నారు.
Read also : Interesting fact: అబ్బో.. ఈ దేశ మహిళలకు మరీ అంత సిగ్గా! కనీసం మగవారితో కలిసి భోజనం కూడా చేయరట..
Read also : Dream Science: కలలో ఈ జంతువులు వస్తే అదృష్టం కలిసొస్తుందట!





