తెలంగాణ

ఆపద వస్తే నేను ఉన్నానంటున్నా నకిరేకంటి మురళి కృష్ణ

మునుగోడు, క్రైమ్ మిర్రర్:- అపద వస్తె నేను ఉన్నా అంటూ ముందుకు వెళ్తూ ఎంతోమందికి ఆపదలో సహాయం అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు నకిరేకంటి మురళీకృష్ణ. నారాయణపురం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన బర్ల యాదమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు మండల యువ నాయకులు సోలిపురం గ్రామానికి చెందిన నకిరేకంటి మురళి కృష్ణ ,యాదమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. తనవంతుగా 50 కేజీల బియ్యం,5 వేల రూపాయలు అందజేషారు. భవిష్యత్ లో యాదమ్మ కుటుంబానికి అండగా వుంటాను అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read also : Apk ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

Read also : స్మృతి మందనా బ్యాడ్ లక్.. పెళ్లి వాయిదానే కాదు.. బయటకు వచ్చిన మరో విషయం?

Read also : అమరేశ్వర సన్నిధిలో అయ్యప్ప మాలధారణ..!

Back to top button