
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో సరదాల కోసం, ఆనందం కోసం ఆల్కహాల్ తీసుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆనందంలో ఉన్నా, బాధలో ఉన్న మద్యం సేవించడం ఫ్యాషన్ గా మారింది. మరోవైపు ఎక్కువగా యువత ప్రేమలో సక్సెస్ అయిన లేదా ప్రేమ విఫలమైన బ్రేకప్ కారణంగా కూడా మద్యాన్ని విపరీతంగా తాగుతున్నారు. ఇలా ఆనందాల కోసమో లేక బాధలను మర్చిపోవడం కోసం ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి అనర్ధాలు కలుగుతాయో తాజాగా ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ మిర్యాల చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతుంది. కొన్ని కొటేషన్స్ రూపంలో మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు కలుగుతుందో వివరించాడు.
1. బాధలో బీరు తాగితే.. బోన్ మ్యారో దెబ్బతింటుంది
2. రమ్ సేవిస్తే రక్తహీనత కలుగుతుంది
3. స్కాచ్ తాగితే సిరోసిస్ తో రక్తం కక్కుకుని చచ్చిపోతారు
4. వోడ్కా వల్ల గవదులు వాచిపోతాయి
5. వైన్ తాగితే గర్భస్రావాలు నాశనమవుతాయి
6. మందు మానుకోరా.. మనిషి వయ్యేవు.
ఇలా సందేశాలను ఇస్తూ.. వివిధ మద్యం రకాలు.. వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని పాడయ్యేలా చేస్తాయని వివరించారు. ఇప్పటికైనా మద్యాన్ని మానుకోండి. మనుషులు అవ్వండి అంటూ చాలా గొప్పగా చెప్పుకోచ్చారు. ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి పూర్తిగా హానికారము అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇతను చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పలువురిని ఆలోచించేలా చేస్తుంది. ఇంత గొప్పగా సందేశం ఇచ్చినందుకు ఇతనికి ఈ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు.
Read also : వేములపల్లిలో దారుణం…. విషపు ఆహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి
Read also : హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్..!





