
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, హొళి గుంద మండలం, దేవరగట్టు గ్రామంలో దసరా ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామంలో ప్రతి ఏడాది కూడా దసరా ఉత్సవాలలో భాగంగా కర్రల సమరం అనేది జరుగుతుంది. దసరా పండుగను పురస్కరించుకొని బన్నీ ఉత్సవంలో భాగంగా మాలమ్మ మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగించడం వాళ్ల ఆచారం. ఈ ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి ఒక మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, మరో ఏడు గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఈ కర్రల సమరం ఒక ఎత్తు అయితే.. ఈ సమరాన్ని చూడడానికి భారీ సంఖ్యలో జనం కూడా తరలివస్తుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ కర్రలు సమరం నిర్వహించారు. కానీ ఈ ఏడాది మాత్రం విషాదంగా మారిపోయింది. ఈ ఉత్సవంలో భాగంగా హింస అనేది చెలరేగకుండా దాదాపు 800 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించిన కూడా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో భాగంగానే ఇరు వర్గాలు కూడా కర్రలతో దాడులు చేసుకోగా వందకు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా… మరో ఐదు మంది పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ స్థానికులు తెలిపారు. విషమంగా మారిన వారిని వెంటనే దగ్గరలోని అదోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. 800 మంది పోలీసులను ఈ ఉత్సవాల దగ్గర బందోబస్తుగా ఏర్పాటు చేసిన కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాత్రికి రాత్రి పెద్ద హింస జరిగిపోయింది. ఇలాంటి ఘటనలు చూస్తున్న చాలామంది కూడా షాకు కు గురవుతున్నారు. దేవాలయాల దగ్గర ఇలాంటి సమరాలు ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా అధికారులు ఈ గ్రామాల ప్రజలపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు.
Read also : గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు!
Read also : ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా గల 10 దేశాలు ఇవే?